కడప: బీసీసీఐ అండర్ -19 అంతర్రాష్ట్ర క్రికెట్‌లో చండీగఢ్ బౌలర్ కాశ్వీ గౌతమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్‌పై వన్డే మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప కేఎల్‌ఆర్ మైదానంలో ఈ అరుదైన రికార్డు నమోదైంది. వన్డే ట్రోఫీలో భాగంగా బుధవారం అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చండీగఢ్ పేసర్, కెప్టెన్ కాశ్వీ గౌతమ్ 29బంతులేసి 12 పరుగులే ఇచ్చి 10మందిని ఔట్ చేసింది. ఇందులో ఓ హ్యాట్రిక్ కూడా ఉంది. కాశ్వీ విజృంభణతో అరుణాచల్ ప్రదేశ్ 8.5ఓవర్లలోనే 25 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అంతకుముందు బ్యాట్‌తోనూ కాశ్వీ మెరిసింది. ఆమె 49పరుగులతో సత్తాచాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చండీగఢ్ 50ఓవర్లలో 186పరుగులు చేసింది. మొత్తానికి కాశ్వీ గౌతమ్ అదిరే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చండీగఢ్ 161పరుగుల భారీ విజయం సాధించింది.